సంగీతాన్ని ద్వేషించే ఉత్సాహవంతురాలైన ఒక న్యాయశాస్త్ర విద్యార్థినికి తాను శిక్షణ పొందుతున్న కార్యాలయంలో ఉద్యోగం చేయాలని ఆకాంక్ష. ఒక ఆకర్షణీయమైన గాయకుడు తటస్థించటంతో ఆమె జీవితం పెద్ద కుదుపుకు గురవుతుంది. తొలిసారిగా ఆమె ప్రేమలో పడుతుంది. మరోవైపు ఆమె తన గతాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఆమెకు ఆ సందర్భంగా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసివస్తుంది: ప్రేమించే పనిని చేయాలా, లేక చేసే పనిని ప్రేమించాలా అని.