ఊహించని మలుపులతో సాగే ఈ సినిమాలో నికోల్ కిడ్ మేన్ నాన్సీ వాండర్ గ్రూట్ పాత్రను పోషించారు. నాన్సీ ఒక టీచర్ ఉద్యోగం చేసే గృహిణి. మిషిగన్ రాష్ట్రంలో తులిప్ పువ్వులకు ప్రసిద్ధిగాంచిన హాలండ్ పట్టణంలో ఆమె తన కొడుకుతో, పట్టణంలో మంచి పేరున్న భర్తతో సంతోషంగా జీవిస్తూ ఉండగా ఆమె జీవితం ఒక మలుపు కారణంగా కుదేలైపోతుంది.